Santosh Nagar: సంతోష్ నగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Santosh Nagar: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా సంతోష్ నగర్, ఐఎస్ సదన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు, ఆర్ఏఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 21 Sept 2026 7:43 PM IST
Santosh Nagar
X

Santosh Nagar: సంతోష్ నగర్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Santosh Nagar: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం నేపథ్యంలో సంతోష్ నగర్. ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడటం, మత సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు.

సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్ దేవ్ సింగ్ నేతృత్వంలో ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో నగర్ సిపి. చార్మినార్ జోన్ డిసిపి ఆదేశాలతోఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని వెల్లడించారు.

పండుగ సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని . గణేశ్ మండపాల నిర్వాహకులు, ఊరేగింపులో పాల్గొనేవారు పోలీసుల నిబంధనలు, సూచనలను కచ్చితంగా పాటించాలని ఏసీపీ తెలిపారు. పోలీసులు సూచించిన మార్గాల్లో, నిర్దేశిత సమయంలోనే ఊరేగింపులు జరపాలని, ట్రాఫిక్‌కు లేదా ప్రజలకు ఎలాంటి అసౌకర్యo కలిగించవద్దని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ కొల సత్యనారాయణ. ఐ ఎస్ సదన్ ఇన్స్పెక్టర్..... ఏస్ఐలు.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బైట్..సుఖ్ దేవ్ సింగ్.ఏసీపీ.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA