Malkajgiri: సఫిల్‌గూడ, బండ చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి!

Malkajgiri: మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని సఫిల్‌గూడ, బండ చెరువుల అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం.

Bodike Manohar, Malkajgiri
Published on: 30 Oct 2026 6:31 PM IST
Malkajgiri
X

Malkajgiri: సఫిల్‌గూడ, బండ చెరువుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి!

Malkajgiri: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సఫిల్‌గూడ చెరువు, బండ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

రెండు చెరువుల వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల ప్రస్తుత పరిస్థితి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు, పనుల జాప్యానికి గల కారణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఒక శాఖకు సంబంధించిన సమస్య కారణంగా మరో శాఖ పనులు నిలిచిపోకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

చెరువుల అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా కార్యాచరణ రూపొందించి, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌తో పాటు లేక్స్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri