Cherlapally: చర్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Cherlapally: చర్లపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ASHOK, KAPRA
Published on: 28 Oct 2026 5:08 PM IST
Cherlapally
X

Cherlapally: చర్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Cherlapally: చర్లపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మంజూరు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) ఆనంద్ ని కలిశారు.

ఈ సందర్భంగా చర్లపల్లి ప్రాంతంలో PHC ఏర్పాటు ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. స్థానిక ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు, అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి PHC ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన డి ఎం హెచ్ త్వరలోనే చర్లపల్లి ప్రాంతాన్ని సందర్శించి, PHC ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అవసరమైన వివరాలను సేకరిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA