Hyderabad: కాప్రా చెరువు పరిధిలో హైడ్రా అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే!

Hyderabad: కాప్రా చెరువు పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశం.

ASHOK, KAPRA
Published on: 28 Oct 2026 5:04 PM IST
Hyderabad
X

Hyderabad: కాప్రా చెరువు పరిధిలో హైడ్రా అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే!

Hyderabad: కాప్రా చెరువు పరిధిలో హైడ్రా ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

చెరువు పరిరక్షణ, పరిసరాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు పరిసరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ భద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

ASHOK, KAPRA

ASHOK, KAPRA