Hyderabad: ఏఐసీసీ చీఫ్ ఖర్గేశో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ

Hyderabad: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ. అసెంబ్లీ పరిణామాలు, 22ఏ భూములు, ఎల్‌నినో ప్రభావంపై చర్చ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 21 Sept 2026 4:57 PM IST
Hyderabad
X

Hyderabad: ఏఐసీసీ చీఫ్ ఖర్గేశో మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ

హైదరాబాద్: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యల అంశంపై ఖర్గే ఆరా తీసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు వెల్లడించారు.

అలాగే 22A భూముల అంశం, ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఖర్గే వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, దాని కారణంగా ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, నీటి వనరులపై ప్రభావం వంటి అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిపారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర సహాయం కోరుతూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఖర్గేతో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించినట్లు తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.