Hyderabad: క్రీడా అకాడమీల కోసం 'స్పోర్ట్-ఈ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ

Hyderabad: గచ్చిబౌలి గోపీచంద్ అకాడమీలో 'స్పోర్ట్-ఈ' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు, గోపీచంద్. క్రీడా అకాడమీల నిర్వహణ మరింత సులభతరం.

RAJESH,	WEST ZONE
Published on: 5 Nov 2026 5:00 PM IST
Hyderabad
X

Hyderabad: క్రీడా అకాడమీల కోసం 'స్పోర్ట్-ఈ' డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ

హైదరాబాద్: క్రీడా అకాడమీల నిర్వహణకు సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. వెబ్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్-ఈ (SportE) ప్లాట్‌ఫామ్‌ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ కలిసి ఆవిష్కరించారు.

క్రీడా వేదికలు, అకాడమీల నిర్వహణను సులభతరం చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన లక్ష్యమని గోపీచంద్ తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్స్, చెల్లింపులు, కస్టమర్ల వివరాలు, మార్కెటింగ్ వంటి సేవలను ఒకే డ్యాష్‌బోర్డ్ ద్వారా నిర్వహించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత అనలిటిక్స్, రిపోర్టింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE