Hyderabad: మాదాపూర్ ది జాయింట్ అల్ మండిలో మటన్లో పుచ్చిన పన్ను!
Hyderabad: హైదరాబాద్ మాదాపూర్లోని ది జాయింట్ అల్ మండిలో కస్టమర్ ఆర్డర్ చేసిన మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను రావడం కలకలం రేపింది.
Hyderabad: మాదాపూర్ ది జాయింట్ అల్ మండిలో మటన్లో పుచ్చిన పన్ను!
హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్లోని ది జాయింట్ అల్ మండి రెస్టారెంట్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హోటల్లో కస్టమర్ ఆర్డర్ చేసిన మటన్ మండి లో ఏకంగా ఒక పుచ్చిపోయిన పన్ను రావడం కలకలం రేపింది. దీనిని గమనించిన కస్టమర్ వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశారు.
అయితే, తప్పును సరిదిద్దుకోవాల్సిన యాజమాన్యం మరింత దురుసుగా ప్రవర్తించింది. ఏం చేసుకుంటావో చేసుకో ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో అంటూ కస్టమర్కు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి బెదిరింపులకు దిగింది.
యాజమాన్యం వ్యవహారశైలిపై విసిగిపోయిన బాధితుడు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నిహారిక మాదాపూర్లోని ది జాయింట్ అల్ మంది రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.
రెస్టారెంట్కు చేరుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఆహార నాణ్యతపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కిచెన్ పరిస్థితులు, వంట తయారీకి వాడుతున్న పదార్థాలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.




