Khairatabad: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదు వేగవంతం చేయాలి!

Khairatabad: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఓటరు దరఖాస్తులను పంపిణీ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 29 Oct 2026 7:19 PM IST
Khairatabad
X

Khairatabad: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదు వేగవంతం చేయాలి!

ఖైరతాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఖైరతాబాద్ డివిజన్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో అధ్యాపకులకు, స్థానిక పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అధ్యాపకులు చొరవ తీసుకుని, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని MGR పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ గజ్జల ఆనంద్ మరియు శామ్ గౌడ్, అభినవ్,నవీన్, బలరాం, తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE