Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 3 రోజుల ప్రజా సదస్సు నిర్వహణ!

Hyderabad: సామాజిక సామరస్యం పెంపొందించేందుకు 'బియాండ్ ది డివైడ్' పేరుతో 3 రోజుల సదస్సు. సోమాజీగూడలో కరపత్రం ఆవిష్కరించిన జమాత్-ఎ-ఇస్లామి హింద్ నేతలు.

RAJESH,	WEST ZONE
Published on: 28 Oct 2026 5:59 PM IST
Hyderabad
X

Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 3 రోజుల ప్రజా సదస్సు నిర్వహణ!

Hyderabad: సమాజంలో పెరుగుతున్న అపోహలు, పక్షపాత భావాలు తప్పుడు సమాచారాన్ని నివారించి, విభిన్న వర్గాల మధ్య సామాజిక సామరస్యం, పరస్పర అవగాహనను పెంపొందించేందుకు "బియాండ్ ది డివైడ్ - కౌంటరింగ్ హేట్, బిల్డింగ్ హార్మనీ"పేరుతో 3 రోజుల ప్రజా సదస్సును నిర్వహిస్తున్నట్లు జమాత్-ఎ-ఇస్లామి హింద్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఎందుకు సంబంధించిన కరపత్రాన్ని జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబషిర్ అహ్మద్, సిటీ కార్యదర్శి ఆజమ్ అలీ బేగ్, హైదరాబాద్ ప్రతినిధి ఇంతియాజ్ లు ఆవిష్కరించారు. ఈనెల 30 నుండి నవంబర్ 1 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు పున్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను హాజరై ప్రారంభిస్తారని తెలిపారు

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE