Hyderabad: హైదరాబాద్‌లో ఎఫ్‌పీటీఏ 65వ జాతీయ సదస్సు!
Hyderabad: హైదరాబాద్‌లో ఎఫ్‌పీటీఏ 65వ జాతీయ సదస్సు అక్టోబర్ 2 నుంచి నోవాటెల్ హెచ్‌ఐసీసీలో నిర్వహణ, తాజ్ దక్కన్‌లో పోస్టర్ ఆవిష్కరణ, 1000 మంది ప్రతినిధుల హాజరు.
Hyderabad: హైదరాబాద్‌లో ఎఫ్‌పీటీఏ 65వ జాతీయ సదస్సు!
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌పీటీఏ) 65వ జాతీయ వార్షిక సదస్సుకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్‌లో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అక్టోబర్ 2 నుంచి 5 వరకు నోవాటెల్ హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా పేపర్ వ్యాపారులు, తయారీదారులు, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానున్నారు. పేపర్ పరిశ్రమ అభివృద్ధి, ఎంఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్, నోట్‌బుక్స్‌పై జీఎస్టీ సరళీకరణ, రీసైకిల్డ్ పేపర్ వినియోగం వంటి కీలక అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.




