Hayathnagar: డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు!
Hayathnagar: హయత్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి కాలనీవాసుల నిరసన. మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మద్దతు.
Hayathnagar: డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు!
Hayathnagar: హయత్ నగర్ పరిధిలోని దుర్గా నగర్, మిథిలా నగర్, లక్ష్మీప్రియ కాలనీ, బృందావన్ నగర్, శివాజీ కాలనీతో పాటు సుమారు 10 కాలనీల ప్రజలు పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేపట్టారు.
మూడు సంవత్సరాల క్రితమే డ్రైనేజీ పనులకు నిధులు మంజూరైనా, ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని కాలనీవాసులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. డ్రైనేజీ మురుగునీటి కారణంగా పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్య కారణంగా సుమారు 15 కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులను ప్రారంభించాలని నవజీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి వంటావార్పు కార్యక్రమం చేపడతామని అధికారులను హెచ్చరించారు.




