Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ, అవగాహన!
Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో 500 మంది యువతకు ఉచిత హెల్మెట్ల పంపిణీ. రోడ్డు నిబంధనలు పాటించాలని నేత పల్లపు గోవర్ధన్ పిలుపు.
Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో ఉచిత హెల్మెట్ల పంపిణీ, అవగాహన!
Hyderabad: యువత రోడ్డు నియమాలు పాటించాలని బంగారు భవిష్యత్‌ను రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ నాశనం చేసుకోవద్దని ఖైరతాబాద్ నియోజక వర్గం సీనియర్ నేత, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ అన్నారు శుక్రవారం ఫిలింనగర్లో ‘డ్రైవ్ సేఫ్ బీ సేఫ్’ అంటూ యువతకు ట్రాఫిక్ రూల్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా 500 మంది యువతకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నియమాలు పాటించాలని ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపడంతో పాటు తాగి వాహనాలు నడపడం వల్ల మన ప్రాణాలతో పాటు అవతలి వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని అన్నారు. త్వరలోనే ఖైరతాబాద్ వ్యాప్తంగా పలు క్యాంపులు నిర్వహించి ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.




