Hyderabad: వేం నరేందర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదు
Hyderabad: రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిపై కంచె ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్. వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన.
Hyderabad: వేం నరేందర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదు
హైదరాబాద్: కంచె ఐలయ్య గారంటే మాకు ఎంతో గౌరవం కానీ వేమ్ నరేందర్ రెడ్డి గారిపై మీరు చేసిన వ్యాఖ్యలు మాత్రం సమంజసం కాదని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమ్మకమైన సహచరుడిగా ఉంటూ రాముడికి హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడు అలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేం నరేందర్ రెడ్డి గారు అలా నమ్మకముగా ఉంటూ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి కి అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ బాధ్యతలు నిర్వహిస్తూ, పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి గారని డాక్టర్ రామకృష్ణ అన్నారు.
వరంగల్ జిల్లా నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుడిపై వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా, ఎవరో చెప్పిన మాటలను నమ్మి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని డాక్టర్ రామకృష్ణ అన్నారు. వేమ్ నరేందర్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాసేవను, ప్రభుత్వానికి అందిస్తున్న సహకారాన్ని పక్కనపెట్టి ఆయనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని అన్నారు.
ముఖ్యంగా వేమ్ నరేందర్ రెడ్డి గారు దళితులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ, వారి ఆకలిని తీరుస్తూ, పేదలు, బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రజానాయకుడిపై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆయన గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసినా అభిమానులుగా, కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని డాక్టర్ రామకృష్ణ హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో, రాజకీయంగా, చట్టబద్ధంగా తగిన విధంగా స్పందిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, విమర్శలు కూడా ఉండవచ్చు. అయితే అవి వాస్తవాల ఆధారంగా ఉండాలి. వ్యక్తుల గౌరవాన్ని కాపాడే విధంగా విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విలువల్లో భాగమని పేర్కొన్నారు. వేమ్ నరేందర్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ప్రజాస్వామ్య విలువలకు, పరస్పర గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని కంచె ఐలయ్య గారిని కోరుతున్నామని డాక్టర్ రామకృష్ణ అన్నారు.




