Hyderabad: ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ పోలీసుల దాడి రూ. 3.50 లక్షల గంజాయి స్వాధీనం
Hyderabad: ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు రూ. 3.50 లక్షల విలువైన 6.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ-బైక్‌పై గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Hyderabad: ధూల్‌పేట్‌లో ఎక్సైజ్ పోలీసుల దాడి రూ. 3.50 లక్షల గంజాయి స్వాధీనం
హైదరాబాద్: ఒరిస్సా నుంచి గంజాయిని దిగుమతి చేసుకొని దూల్పేట్ లో గంజాయిని అమ్మడానికి సురేష్ సింగ్ అలియాస్ టింకు సింగ్, ప్రమోద్ మోరే ఎలక్ట్రికల్ స్కూటీపై గంజాయిని తీసుకొస్తున్న క్రమంలో దూల్పేట్ ఎక్సైజ్ సీఐ ప్రవీణ్ కుమార్ ఇతరులు కలిసి పట్టుకున్నారు.
నిందితుల వద్ద 6.2 కేజీల గంజాయిని రూపాయలు 10000 నగదును మూడు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయిని దూల్పేట్ లోని శివాలయం టెంపుల్ జియాగూడ ప్రాంతంలో పట్టుకున్నారు.
గంజాయి పట్టుకున్న టీం లో సీఐ ప్రవీణ్ కుమార్ తో పాటు విప్లవ రెడ్డి వెంకన్నలతోపాటు కానిస్టేబుల్ జనార్ధన్, రవి, కృష్ణ ప్రసాద్, సూర్య,నాగరాజు, బీరప్ప, హేమాలు ఉన్నారు




