Hyderabad: శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు సీపీఐ నేతల నివాళి

Hyderabad: శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు సీపీఐ నేతలు, బీసీ దళ్ నాయకులు ఘన నివాళి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు స్మరణీయం.

RAJESH,	WEST ZONE
Published on: 5 Nov 2026 5:11 PM IST
Hyderabad
X

Hyderabad: శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు సీపీఐ నేతల నివాళి

హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్‌కు సీపీఐ నేతలు, బీసీ దళ్ నాయకులు ఘన నివాళులర్పించారు. పల్లా వెంకటరెడ్డి, రామకృష్ణ, దుండ్ర కుమారస్వామి ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి సంతాపం తెలిపారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, యాదవ సమాజ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE