Hyderabad: మూసీ సుందరీకరణ టెండర్లలో 40 శాతం కమిషన్ ఆరోపణలు బీఆర్ఎస్!

Hyderabad: మూసీ సుందరీకరణ గ్లోబల్ టెండర్లలో 40 శాతం కమిషన్ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి. మూసీ బాట అడ్డుకోవడంపై ఆగ్రహం.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 28 Oct 2026 3:18 PM IST
Hyderabad
X

Hyderabad: మూసీ సుందరీకరణ టెండర్లలో 40 శాతం కమిషన్ ఆరోపణలు బీఆర్ఎస్!

హైదరాబాద్‌: నగరం లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేగింది. రూ.7,345 కోట్ల గ్లోబల్ టెండర్లలో 40 శాతం కమిషన్‌ రేవంత్‌ రెడ్డికి వెళ్తుందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కార్తీక్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో రైతులు సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో మూసీ సుందరీకరణకు వేల కోట్లు ఖర్చు చేయడంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు.

ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను పక్కనపెట్టి, మూసీ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని నిలదీశారు.

మూసీ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు చేపట్టిన మూసీ బాటను పోలీసులు అడ్డుకోవడం, నేతలను నిర్బంధించి కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.

కాంగ్రెస్‌ నేతలకు ఒక న్యాయం బీఆర్‌ఎస్‌ నేతలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇది రాజకీయ అభిప్రాయ సేకరణ కాదని, మూసీ నిర్వాసితుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రజా కార్యక్రమమని స్పష్టం చేశారు.

అక్రమ అరెస్టులతో ప్రజల పక్షాన నిలబడే తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. మూసీ నిర్వాసితుల గోడు వినడమే తమ లక్ష్యమని, వారి సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు వెల్లడించారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA