Hyderabad: ఉదయ్ నగర్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించిన MGR

Hyderabad: ఖైరతాబాద్ ఉదయ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR). స్థానికుల హర్షం.

RAJESH,	WEST ZONE
Updated on: 31 Oct 2026 7:36 PM IST
Hyderabad
X

Hyderabad: ఉదయ్ నగర్‌లో డ్రైనేజీ సమస్య పరిష్కరించిన MGR

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా, బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్ నగర్ వీధి నెంబర్ 07లో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లుతున్న సమస్యపై స్పందించిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)గారు.

ఈ సమస్యను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముర్తుజా గారు MGR దృష్టికి తీసుకురావడంతో, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 07 జీహెచ్‌ఎంసీ మేనేజర్ శివ గారితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

MGR విజ్ఞప్తికి స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టి డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE