Hyderabad: కాంగ్రెస్‌కు గత చరిత్ర లేదా?: బీజేపీ నేతల ఘాటు విమర్శలు!
Hyderabad: స్వతంత్ర సంస్థలపై కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమన్న బీజేపీ నేత సోలంకి శ్రీనివాస్. గత పాలనపై తీవ్ర విమర్శలు.
Hyderabad: కాంగ్రెస్‌కు గత చరిత్ర లేదా?: బీజేపీ నేతల ఘాటు విమర్శలు!
Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయం బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్. స్వతంత్ర సంస్థలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారం.. సంస్థల స్వతంత్రతపై మాట్లాడే ముందు కాంగ్రెస్ తన గతాన్ని పరిశీలించుకోవాలి. ఎన్నికల సంఘం నియామకాలపై కాంగ్రెస్ పాలనలోనూ వివాదాలు ఉన్నాయి.
కాంగ్రెస్ హయాంలో మాజీ ఎన్నికల కమిషనర్లను గవర్నర్, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు నియమించడంపై విమర్శ.. టీఎన్ శేషన్ ఎన్నికల నిర్వహణ, అనంతర రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలి..
నవీన్ చావ్లా నియామకం, పదోన్నతిపై కాంగ్రెస్ బదులు చెప్పాలి. ఎన్నికల సంఘం నిర్ణయాలు రాజకీయ ప్రభావానికి లోనయ్యాయి. మాజీ సీబీఐ డైరెక్టర్ల నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర ఉంది. సీబీఐపై రాజకీయ జోక్యం ఉందన్న విమర్శలకు కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్.
రంజిత్ సిన్హా వ్యవహారాన్ని సీబీఐ స్వతంత్రతపై ఉదాహరణ కదా. అత్యవసర పరిస్థితి సమయంలో న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చింది. జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా సీనియారిటీని పక్కనపెట్టి నియామకం చేశారని విమర్శ.
తెలంగాణలో బీజేపీ నిరసనలను అడ్డుకుని నేతలను నిర్బంధించారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు. హైదరాబాద్‌లో బీజేపీ నిరసనలకు అనుమతి ఎలా నిరాకరిస్తారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్.
హైడ్రా చర్యలు, పేదల ఇళ్ల తొలగింపులపై బీజేపీ ఆందోళన. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలని చెబుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు బీజేపీ విజ్ఞప్తి.




