Hyderabad: ఆకట్టుకున్న ‘ఆసియా జ్యూవెల్స్ షో 2026’ ఆభరణాల ప్రదర్శన!
Hyderabad: బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ‘ఆసియా జ్యూవెల్స్ షో 2026’ ప్రీమియం ఆభరణాల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో దాదాపు 50 వేల డిజైన్ల ఆభరణాలు కొలువుదీరాయి.
Hyderabad: ఆకట్టుకున్న ‘ఆసియా జ్యూవెల్స్ షో 2026’ ఆభరణాల ప్రదర్శన!
హైదరాబాద్: ప్రీమియం ఆభరణాల ప్రదర్శన 'ఆసియా జ్యూవెల్స్ షో 2026' పేరిట బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణలో ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థలకు చెందిన దాదాపు 50 వేల డిజైన్ల ఆభరణాలు ప్రదర్శనలో కొలువుదీరాయి.
ప్రదర్శన నిర్వాహకుడు హరీశ్ సల్దేవ్, సినీతారలు తేజస్వి మడివాడ, పాయల్ రాజ్పుత్, దక్ష నగార్కర్, రీతూ చౌదరి, ప్రాంతికా దాస్, మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళ చౌహాన్ జ్యోతి వెలిగించి ప్రదర్శనను ప్రారంభించారు. నిర్వాహకుడు మాట్లాడుతూ.. ప్రదర్శన మూడు రోజులు పాటు కొనసాగుతుందని చెప్పారు.




