Hyderabad: మాజీ గవర్నర్ దత్తాత్రేయ నివాసంలో ఆయుధ పూజ
Hyderabad: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆయుధ పూజ. నల్గొండ గద్దర్ నర్సీరెడ్డి పాడిన 'అలయ్ బలాయ్ 2026' పాటను హైదరాబాద్‌లో ఆవిష్కరించిన దత్తాత్రేయ.
Hyderabad: మాజీ గవర్నర్ దత్తాత్రేయ నివాసంలో ఆయుధ పూజ
హైదరాబాద్: శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన నివాసంలో ఆయుధ పూజ నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే దత్తన్న అలై బలై 2026 వేడుకలను పురస్కరించుకుని, నల్గొండ గద్దర్ గా ప్రసిద్ధి చెందిన గాయకుడు నర్సీ రెడ్డి ఆలపించిన అలై బలై 2026 పాటను హైదరాబాద్ లో దత్తాత్రేయ ఆవిష్కరించారు.
దత్తన్న మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రజలు ఒకే వేదికపై కలిసి ఆప్యాయత పంచుకోవడమే అలై బలై ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ వేడుకలు అక్టోబర్ 22న గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్నాయి.
అలయ్ బలాయ్ పాట ఆవిష్కరణలో పాల్గొన్న అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ బండారు విజయలక్ష్మీ,సింగర్ నర్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




