L.B. Nagar: చేతి గోరుపై గణేష్ నిమజ్జనం చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు!

L.B. Nagar: ఎల్బీనగర్ మన్సూరాబాద్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాగార్జునపు రాము తన చేతి గోరుపై అద్భుతంగా ఆవిష్కరించిన గణేష్ నిమజ్జన సూక్ష్మ చిత్రం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 24 Sept 2026 1:47 PM IST
L.B. Nagar
X

L.B. Nagar: చేతి గోరుపై గణేష్ నిమజ్జనం చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు!

L.B. Nagar: గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని మన్సూరాబాద్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు నాగార్జునపు రాము తన ప్రత్యేక కళాప్రతిభను చాటుకున్నారు. తన చేతి గోరుపైనే గణేశుడు నిమజ్జనం అవుతున్న దృశ్యాన్ని అద్భుతంగా చిత్రించారు. అత్యంత సూక్ష్మంగా గోరుపై గణేష్ నిమజ్జన చిత్రాన్ని ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నారు. వినూత్న రీతిలో గణేశుడిపై తన భక్తిని చాటుకున్న నాగార్జునపు రాము ప్రజలందరికీ గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR