Hyderabad: చర్లపల్లిలో ఘనంగా గ్రాండ్ బెల్ట్ కార్యక్రమం బ్లాక్ బెల్ట్లు ప్రదానం చేసిన సుమన్!

Hyderabad: చర్లపల్లిలో ఘనంగా గ్రాండ్ బెల్ట్ కార్యక్రమం. కరాటే విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ప్రదానం చేసిన ప్రముఖ నటుడు సుమన్ తల్వార్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ASHOK, KAPRA
Published on: 28 Oct 2026 4:04 PM IST
Hyderabad
X

Hyderabad: చర్లపల్లిలో ఘనంగా గ్రాండ్ బెల్ట్ కార్యక్రమం బ్లాక్ బెల్ట్లు ప్రదానం చేసిన సుమన్!

Hyderabad: ఎస్.ఎస్.కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో చర్లపల్లి సిఐఏ హాలులో గ్రాండ్ బెల్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు సుమన్ తల్వార్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, పలువురు ప్రముఖులు, నాయకులు, కరాటే శిక్షణ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు హీరో సుమన్ తల్వార్ బ్లాక్ బెల్ట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ తల్వార్ మాట్లాడుతూ మహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

తాను 11వ ఏట మార్షల్ ఆర్ట్స్ కరాటేలోకి వచ్చానని ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయ్యిందన్నారు. తాను జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని, పలు రకాల సమస్యలు, ఆటుపోట్లను ఎదుర్కొని జీవితంలో పైకి ఎదగడానికి నా తల్లిదండ్రులు, మార్షల్ ఆర్ట్స్, తన విదేశీ కోచ్, ఎంతగానో దోహదపడ్డారని, బుద్ధిజం, క్రమశిక్షణ వల్ల ఉన్నత స్థానానికి ఎదిగానని హీరో సుమన్ తెలిపారు. ఈ మార్షల్ ఆర్ట్స్, కరాటే వలన జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల, కృషి, ఓపిక, సమస్యలను ఎదుర్కోగల శక్తి వస్తుందని తెలిపారు.

తల్లిదండ్రుల అన్ని సమయాల్లో తమ పిల్లలతో ఉండరని, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలకోసం ఎన్నో ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందని, అలాంటి ఒంటరిగా ఉన్న సమయంలో చిన్నారులు, యువతులు, మహిళలు తమను తాము దోపిడీ దొంగలు, నేరగాళ్లనుండి, రేపిస్టుల నుండి రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తనకు గన్ మెన్ లు లేకుండా ఉండటం హర్షించదగిన విషయం అన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థినీ విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్, కరాటేలో ప్రతినిత్యం శిక్షణ తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని హీరో సుమన్ తల్వార్ సూచించారు.

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆత్మరక్షణకోసం కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సహాయం చేస్తానని, ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాంకు వస్తే వారి పూర్తి ఖర్చు తానే భరిస్తామని తెలిపారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA