Medchal: వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం.. రూ. 4 లక్షల ఆస్తి నష్టం!
Medchal: ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలో వాటర్ హీటర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం.
Medchal: వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం.. రూ. 4 లక్షల ఆస్తి నష్టం!
Medchal: ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు సోమారం గ్రామంలో వాటర్ హీటర్ పేలిన ప్రమాదంలో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. 4 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. గ్రామానికి చెందిన బల్గురి మహేష్ అనే వ్యక్తి తన ఇంట్లో స్నానం కోసం వాటర్ హీటర్ పెట్టి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే హీటర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన రెండున్నర క్వింటాళ్ల బియ్యంతో పాటు బట్టలు, నిత్యావసర సరుకులు, విలువైన గృహోపకరణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.




