Hyderabad: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ!
Hyderabad: దసరా పండుగ రద్దీతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Hyderabad: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ!
Hyderabad: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్...విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది.చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు ప్రతిరోజు4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.జాతీయ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్ స్పాట్లలో పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చౌటుప్పల్ పోలీసులు లక్కారం నుంచి అంకిరెడ్డిగూడెం మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ పెరగడంతో విజయవాడ వైపు తొమ్మిది టోల్ బూత్‌లను తెరిచారు. సాధారణ రోజుల్లో 25 వేల వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై, పండుగ నేపథ్యంలో గత ఐదు రోజులుగా రోజుకు 50 వేల నుంచి 60 వేల వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం..




