Hayathnagar: రూ. 5.70 లక్షలకు శివం హిల్స్ గణపతి లడ్డూ వేలం పాట
Hayathnagar: హయత్‌నగర్ శివం హిల్స్‌లో ఘనంగా గణపతి లడ్డూ వేలం. రూ. 5.70 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్న ఝాన్సీ లక్ష్మి-జంగయ్య గౌడ్ దంపతులు.
Hayathnagar: రూ. 5.70 లక్షలకు శివం హిల్స్ గణపతి లడ్డూ వేలం పాట
హయత్‌నగర్: హయత్‌నగర్‌లోని శివం హిల్స్ హిందూ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా జరిగింది.
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేలంలో గణపతి లడ్డూ ప్రసాదాన్ని కాటేపల్లి ఝాన్సీ లక్ష్మి–జంగయ్య గౌడ్ దంపతులు రూ.5,70,000కు దక్కించుకున్నారు.
లడ్డూను దక్కించుకున్న ఝాన్సీ లక్ష్మి–జంగయ్య గౌడ్ దంపతులను సొసైటీ సభ్యులు, భక్తులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
స్వామివారి కృపతో తమ కుటుంబానికి శుభం కలగాలనే ఉద్దేశంతోనే వేలంలో పాల్గొని లడ్డూను సొంతం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివం హిల్స్ హిందూ సొసైటీ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




