Hayathnagar: హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం: అక్కాతమ్ముడు మృతి

Hayathnagar: హయత్‌నగర్‌లో పండుగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న డీసీఎం బ్రేక్ వేయడంతో వెనుక వచ్చిన థార్ కారు స్కూటీని ఢీకొట్టడంతో అక్కాతమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు.

AJAY, HAYATH NAGAR
Published on: 18 Oct 2026 5:21 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం: అక్కాతమ్ముడు మృతి

హయత్ నగర్: హయత్ నగర్‌లో పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూటీపై ప్రయాణిస్తున్న అక్కాతమ్ముడిని వెనుక నుంచి వచ్చిన థార్ కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ప్రయాణిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన జంగయ్య కుమార్తె రేఖకు వివాహం కాగా, ఆమె ప్రస్తుతం శంషాబాద్‌లోని సుల్తాన్‌పల్లిలో నివాసం ఉంటోంది. మరో రెండు రోజుల్లో దసరా పండుగ ఉండటంతో పుట్టింటికి వచ్చేందుకు శంషాబాద్ నుంచి బయలుదేరిన రేఖ, ఎల్బీనగర్‌లో బస్సు దిగింది. అక్కడికి వచ్చిన తన బాబాయి కుమారుడు నవీన్ స్కూటీపై రేఖను, ఆమెతో పాటు ఉన్న చిన్నారిని ఎక్కించుకుని బయలుదేరాడు.

ఈ క్రమంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకోగానే, ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న థార్ కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్, రేఖ మృతి చెందగా, చిన్నారి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిన్నారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన థార్ కారు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR