Hayathnagar: నారాయణ ప్రీమియర్ లీగ్ విజేతగా హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు

Hayathnagar: నారాయణ ప్రీమియర్ లీగ్‌లో విజృంభించిన హయత్ నగర్ బ్రాంచ్. వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకున్న విద్యార్థులకు ఏజీఎం రవీంద్రబాబు సత్కారం.

AJAY, HAYATH NAGAR
Published on: 7 Nov 2026 7:07 PM IST
Hayathnagar
X

Hayathnagar: నారాయణ ప్రీమియర్ లీగ్ విజేతగా హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు

హయత్ నగర్: నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌గా నిలిచారు. వివిధ క్రీడా విభాగాల్లో తమ సత్తా చాటుతూ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

ఈ పోటీల్లో కబడ్డీ, క్రికెట్, త్రోబాల్, డాడ్జ్‌బాల్, రన్నింగ్, చెస్ తదితర క్రీడా విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి, క్రీడా నైపుణ్యంతో అద్భుత ప్రదర్శన కనబరిచి విజయం సాధించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ తాము ముందున్నామని నిరూపించారు.

ఈ కార్యక్రమాన్ని GM గోపాల్ రెడ్డి, వనస్థలిపురం AGM రవీంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. జోన్ ఛాంపియన్‌గా నిలిచిన హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులకు AGM రవీంద్రబాబు చేతుల మీదుగా ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హయత్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ లావణ్య రెడ్డి, మానస, హైస్కూల్ RMD శివరంజని, NPL ఇన్‌చార్జి రోహిణి, ఈ-చాన్స్ R&D మహేశ్వరి, ఈ-కిడ్స్ R&D మీనా, స్పోర్ట్స్ RP సురేష్, సాఫ్ట్ స్కిల్స్ జాజి రెడ్డి, హైస్కూల్ కోఆర్డినేటర్ సృజన్, ఈ-చాన్స్ కోఆర్డినేటర్ దివ్య, ఈ-కిడ్స్ కోఆర్డినేటర్ ప్రియాంక, AD మంజుల, ఈ-చాన్స్ VP కవిత, ఈ-కిడ్స్ VP, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల విజయానికి క్రీడా శిక్షకుల మార్గదర్శకత్వం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, పాఠశాల యాజమాన్యం సహకారం ఎంతగానో దోహదపడ్డాయని నిర్వాహకులు తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.

వనస్థలిపురం జోన్ ఛాంపియన్‌గా నిలిచిన హయత్ నగర్ బ్రాంచ్ విద్యార్థులకు పలువురు అభినందనలు తెలిపారు. రాబోయే పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి నారాయణ విద్యాసంస్థలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR