Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని కేటీఆర్‌ను కోరిన లక్ష్మీనర్సింహా రెడ్డి!

Hyderabad: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిత్వం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి కోరారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Nov 2026 5:13 PM IST
Hyderabad
X

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని కేటీఆర్‌ను కోరిన లక్ష్మీనర్సింహా రెడ్డి!

Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ అభ్యర్థిత్వంపై అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో తన భాగస్వామ్యం, సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యావంతుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఎమ్మెల్సీగా పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని లక్ష్మీ నర్సింహ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు అన్నారు.

పార్టీ నాయకత్వం తనకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడటంతో పాటు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY