Medchal: గ్రేటర్ హైదరాబాద్ పీఓడబ్ల్యూ కన్వీనర్‌గా తుమ్మ రాణి నియామకం!
Medchal: గ్రేటర్ హైదరాబాద్ పీఓడబ్ల్యూ కన్వీనర్‌గా తుమ్మ రాణి, జవహర్‌నగర్ కన్వీనర్‌గా యమున గౌడ్ నియమితులయ్యారు. మహిళలపై దాడులను ఖండిస్తూ నేతలు నిరసన తెలిపారు.
Medchal: గ్రేటర్ హైదరాబాద్ పీఓడబ్ల్యూ కన్వీనర్‌గా తుమ్మ రాణి నియామకం!
Medchal: గ్రేటర్ హైదరాబాద్ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ–విముక్తి) కన్వీనర్‌గా తుమ్మ రాణి, జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ పరిధి కన్వీనర్‌గా యమున గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఆ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రెటరీ గడిపే సునీత ప్రకటించారు.
కీసర సర్కిల్ జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని దళిత సంక్షేమ భవన్‌లో గురువారం పీఓడబ్ల్యూ–విముక్తి గ్రేటర్ హైదరాబాద్ మహిళా కార్యకర్తల సమావేశం గడిపే సునీత ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి షేక్ షావలి హాజరయ్యారు.
ఈ సందర్భంగా షేక్ షావలి మాట్లాడుతూ మహిళలపై హింస, వివక్ష, దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు ఉన్నప్పటికీ, పేద, సామాన్య, మధ్యతరగతి మహిళలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.
మహిళలు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని, పురుషాధిక్యత భావజాలం, మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం నూతనంగా నియమితులైన తుమ్మ రాణి, యమున గౌడ్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు గడిపే సునీత ప్రకటించారు. అలాగే జవహర్‌నగర్‌లో ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పుగా మారిన రాంకీ డంపింగ్ యార్డును శాశ్వతంగా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని షేక్ షావలి డిమాండ్ చేశారు.




