Hayathnagar: బోర్‌వెల్ రంగాన్ని ఆదుకోవాలి: డిప్యూటీ సీఎంకు వినతి!

Hayathnagar: బోర్‌వెల్ రంగాన్ని, కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ బోర్‌వెల్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేసింది. అసెంబ్లీలో చర్చిస్తామని హామీ.

AJAY, HAYATH NAGAR
Published on: 3 Nov 2026 10:29 PM IST
Hayathnagar
X

Hayathnagar: బోర్‌వెల్ రంగాన్ని ఆదుకోవాలి: డిప్యూటీ సీఎంకు వినతి!

హయత్ నగర్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బోర్‌వెల్స్‌పై తీసుకున్న నిర్ణయంపై గ్రేటర్ హైదరాబాద్ బోర్‌వెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోర్‌వెల్ రంగంపై ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

బోర్‌వెల్ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులు, వ్యాపారులు, వాటిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సూచనలు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ రంగాన్ని, దానిపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ ప్రతినిధుల వినతిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బోర్‌వెల్ రంగానికి సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంను కలిసేందుకు సహకరించి, తన విలువైన సమయాన్ని కేటాయించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి గ్రేటర్ హైదరాబాద్ బోర్‌వెల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బోర్‌వెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ముసుకు అంజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు జంగయ్య గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR