Shabad: మూడు రోజులుగా వైభవంగా షాబాద్ శివాలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ!
Shabad: షాబాద్ మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ వేడుకలు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
Shabad: మూడు రోజులుగా వైభవంగా షాబాద్ శివాలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ!
షాబాద్: షాబాద్ మండల కేంద్రంలోని శివాలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు మూడు రోజులుగా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణం అనంతరం నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.
మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, రుద్రాభిషేకాలు, శివాలయ శుద్ధీకరణ, విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల శివనామస్మరణతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామ ప్రజలు, భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు గ్రామ ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత పెంపొందించాయని పలువురు పేర్కొన్నారు.
హోప్ ఫౌండేషన్ కొండా విజయ్,ఎగురి మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షాబాద్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ రాహుల్, మాజీ సర్పంచ్ రవీందర్, వెంకట్ యాదవ్, శీను పంతులు, గ్రామ వార్డ్ సభ్యులు,శ్రీకర్, ఈపూరి వెంకట రమణ, కొండ ప్రదీప్,సత్యం,రజనీకాంత్ ,దండు కృష్ణ ,సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.




