Nacharam: నాచారం శాంతి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!
Nacharam: హైదరాబాద్ నాచారంలోని శాంతి గార్డెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Nacharam: నాచారం శాంతి గార్డెన్‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!
నాచారం: నాచారంలోని శాంతి గార్డెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అసోసియేషన్ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం అన్నదాతలు రమేష్, రాజశేఖర్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్, శ్రీధర్, ఉమేష్, అజయ్, అరవింద్, శ్రీకాంత్, నాయర్, రమేష్, విజయ్, గౌతంరెడ్డితో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు భక్తి భావంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.




