Shabad: బాల త్రిపుర సుందరిగా దుర్గామాత దర్శనం.. 19 మంది భక్తుల మాలధారణ!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ చౌరస్తాలో దుర్గా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమివ్వగా, 19 మంది భక్తులు మాలధారణ చేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 11 Oct 2026 9:41 PM IST
Shabad
X

Shabad: బాల త్రిపుర సుందరిగా దుర్గామాత దర్శనం.. 19 మంది భక్తుల మాలధారణ!

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని చౌరస్తాలో దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మొదటిరోజు ఉదయం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 19 మంది భక్తులు దుర్గామాల ధరించి అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. నవరాత్రి దీక్షను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు సంకల్పించారు.

మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని పీఎస్‌బీవీకే సిండికేట్ సమర్పించింది. సాయంత్రం పీఎస్‌బీవీకే సిండికేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అల్పాహారాన్ని షాబాద్ ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళహారతులు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

దుర్గామాత ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. నవరాత్రి ఉత్సవాలు షాబాద్‌లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఐక్యతను చాటిచెబుతున్నాయి.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA