Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహణ!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదివారం దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

HARISH, TARNAKA
Published on: 29 Nov 2026 3:55 PM IST
Osmania University
X

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహణ!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిన దీక్షా దివస్ వేడుకలను ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ, నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో మరువలేని రోజని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమానికి కొత్త ఊపునిచ్చిందని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు సాగారని పేర్కొన్నారు.

“తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, అనేక తరాల కలలు, ఉద్యమకారుల త్యాగాల ఫలితమని పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటం, త్యాగం, పట్టుదల భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ ఆశయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్వీ రాష్ట్ర సీనియర్ నాయకులు టైగర్ రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దమ్మ రమేష్, కోనపురం శశిపాల్, చెటారి దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA