Vikarabad: వికారాబాద్ సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు!

Vikarabad: వికారాబాద్ సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు. దసరా సెలవుల వేళ పాఠశాలలో విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆటపాటలతో సందడి.

MOGULAIAH, VIKARABAD
Published on: 10 Oct 2026 10:42 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు!

Vikarabad: దసరా సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో చివరి పని దినమైన ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ఆకర్షణీయంగా అలంకరించి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ, ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు విద్యార్థుల్లో పండుగల పట్ల ఆసక్తిని పెంపొందించేలా ఈ వేడుకలు నిర్వహించారు. దసరా సెలవులకు ముందు పాఠశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలు విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పాఠశాల ప్రాంగణమంతా బతుకమ్మ పాటలు, విద్యార్థినుల సందడితో పండుగ శోభను సంతరించుకుంది.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD