Nacharam: నాచారం ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక అన్నదానం!
Nacharam: నాచారం ఇందిరానగర్ నల్ల పోచమ్మ ఆలయ వినాయక మండపంలో ఘనంగా అన్నదానం. బాలయ్య-పద్మ దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.
Nacharam: నాచారం ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక అన్నదానం!
నాచారం: ఇందిరానగర్‌లోని నల్ల పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బాలయ్య–పద్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




