Pargi: పరిగి మండలం మిట్టకోడూరులో వివాదాస్పదంగా మారిన గ్రామ సభ!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరులో గ్రామ సభ గుడిలో నిర్వహించడం వివాదాస్పదమైంది. సర్పంచ్, సెక్రటరీ తీరుపై వార్డు సభ్యులు నిరసన తెలిపారు.

WAZID, PARIGI
Published on: 2 Oct 2026 4:08 PM IST
Pargi
X

Pargi: పరిగి మండలం మిట్టకోడూరులో వివాదాస్పదంగా మారిన గ్రామ సభ!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరులో గ్రామ సభ నిర్వహణ వివాదాస్పదంగా మారింది.గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన గ్రామ సభను గుడిలో నిర్వహించడంపై వార్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ సర్పంచ్ మాణిక్యం, పంచాయతీ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు వార్డు సభ్యులు ఆరోపించారు.కేవలం ముగ్గురు వార్డు సభ్యులు, కొందరు గ్రామస్థులతో కలిసి సెక్రటరీ గుడిలోనే గ్రామ సభ నిర్వహించారని మరో వర్గం వార్డు సభ్యులు విమర్శించారు.అయితే మరోవైపు ఏడుగురు వార్డు సభ్యులు, కొందరు గ్రామస్థులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.గ్రామ సభను పంచాయతీ భవనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

గ్రామ సభ నిర్వహణ విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ, సెక్రటరీ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని నిరసనకు దిగిన వార్డు సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, గ్రామ సభ సందర్భంగా ఇరు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో మిట్టకోడూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నీరసనకు దిగిన వార్డు సభ్యులు, సర్పంచ్ బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

దీంతో గ్రామ సభ వేదికగా బీఆర్ఎస్‌లోని అంతర్గత గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయన్న చర్చ స్థానికంగా జరుగుతోంది.

మరి గ్రామ సభ నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించారా. గుడిలో గ్రామ సభ నిర్వహించడానికి అనుమతులు ఉన్నాయా.

వార్డు సభ్యుల ఆరోపణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఉన్నతాధికారుల సమాధానం కోసం మిట్టకోడూరు గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI