Kothur: జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. బల్మూరి వెంకట్ దంపతులకు గాయాలు!
Kothur: కొత్తూరు జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డీసీఎం ఢీకొనడంతో కారు ధ్వంసమైంది.
Kothur: జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. బల్మూరి వెంకట్ దంపతులకు గాయాలు!
Kothur: రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు.
తిరుపతి దర్శనం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా కొత్తూరు జంక్షన్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో బల్మూరి వెంకట్ దంపతులు మరో కారులో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.




