Vikarabad: రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఏఐకేఎస్
Vikarabad: ఎల్‌నినోతో ఎండిన పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని, ధరూర్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది.
Vikarabad: రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఏఐకేఎస్
వికారాబాద్: ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ధరూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులను ఆదుకునేందుకు రూ.200 కోట్లు విడుదల చేయాలని కోరారు. నవంబర్ 15న నిర్వహించనున్న 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ధరూర్ మండల కేంద్రంలో ఆదివారం అఖిల భారత కిసాన్ సభ (AIKS) తెలంగాణ రైతు సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మదులపల్లి సుదర్శన్, జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వికారాబాద్ జిల్లాలోని 20 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, ముఖ్యంగా ధరూర్ మండలాన్ని కరువు మండలంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ శాసనసభ స్పీకర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి, జిల్లాలోని వ్యవసాయ అధికారులు క్షేత్.




