Secunderabad: పెళ్లికి తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని నిలదీసిన తలసాని!

Secunderabad: సికింద్రాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన తలసాని, పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

Srikanth, Secunderabad
Published on: 6 Nov 2026 11:45 AM IST
Secunderabad
X

Secunderabad: పెళ్లికి తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని నిలదీసిన తలసాని!

Secunderabad: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు.

రాష్ట్రం ప్రభుత్వం అన్ని రకాలుగా పెయిల్ అయ్యిందని.ఇస్తామన్న ప్రజా సంక్షేమ పథకాలు,ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని తలసాని ఆరోపించారు.

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆర్ధిక సాయం తోపాటు తులం బంగారం ఇవ్వాలని పేద ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నట్లు తలసాని తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad