Medchal: మేడ్చల్ అత్వెల్లిలో ఘనంగా పింఛన్ల పంపిణీ.. హాజరైన ప్రముఖులు!

Medchal: మేడ్చల్ డివిజన్ పరిధిలోని అత్వెల్లిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కలెక్టర్ మను చౌదరి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 17 Nov 2026 12:43 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ అత్వెల్లిలో ఘనంగా పింఛన్ల పంపిణీ.. హాజరైన ప్రముఖులు!

Medchal: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ పరిధి అత్వెల్లిలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. కాగా, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 వేల 553 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయగా, మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో 6 వేల 680 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పలువురికి ఆర్థిక భరోసా లభించనుంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL