Gottimukkala: గొట్టిముక్కలలో ఘనంగా బతుకమ్మ పండుగ
Gottimukkala: వికారాబాద్ గొట్టిముక్కలలో సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
Gottimukkala: గొట్టిముక్కలలో ఘనంగా బతుకమ్మ పండుగ
వికారాబాద్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు అని,బతుకమ్మ అంటేనే తెలంగాణ అని గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య అన్నారు.ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో బతుకమ్మ వేడుకలు గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా మహిళలు పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు.
పేర్చిన బతుకమ్మలతో మహిళలంత హనుమాన్ దేవాలయం వద్ద చేరి బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య మాట్లాడుతూ....బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని, ఇది మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రకృతి పండుగ అని అన్నారు. మన పెద్దలు మనకు అందించిన ఈ గొప్ప సంప్రదాయాన్ని, సంస్కృతిని, జీవన విధానాన్ని మనమందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోందని,అందులో భాగంగానే మన గ్రామంలో బతుకమ్మ పండుగను జరపడం జరిగిందన్నారు. ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, మన ఆడబిడ్డలు, రైతన్నలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అందరి సహకారం అందించాలని కోరారు. అనంతరం బతుకమ్మలను పెద్ద వాగులో వదిలారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మైసా గోపాల్,గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




