Hyderabad: జపాన్ ఇన్‌స్టిట్యూట్‌తో హైదరాబాద్ గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కీలక ఒప్పందం!

Hyderabad: జపాన్‌కు చెందిన సిస్టమ్స్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో హైదరాబాద్ గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ క్యాన్సర్, ఏఐ వైద్య పరిశోధనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

RAJESH,	WEST ZONE
Published on: 3 Nov 2026 11:05 AM IST
Hyderabad
X

Hyderabad: జపాన్ ఇన్‌స్టిట్యూట్‌తో హైదరాబాద్ గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కీలక ఒప్పందం!

Hyderabad: జపాన్‌కు చెందిన సిస్టమ్స్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశోధన సహకార ఒప్పందంపై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.

గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రవీంద్రనాథ్ కంచెర్ల, సిస్టమ్స్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు డాక్టర్ హిరోఆకి కిటానో ఈ భాగస్వామ్యానికి దిశానిర్దేశం చేయనున్నారు. క్యాన్సర్ పరిశోధన, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, దీర్ఘాయుష్షు వంటి మూడు కీలక రంగాల్లో సంయుక్తంగా పరిశోధనలు చేపట్టనున్నారు.

ఏఐ ఆధారిత వైద్య పరిష్కారాలు, వ్యాధులను ముందస్తుగా గుర్తించే సాంకేతికతల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రపంచస్థాయి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని భారత వైద్యరంగ అవసరాలకు అనుసంధానించడమే ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని ఇరు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE