Vikarabad: గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి చెరువులోకి తప్పిన ప్రమాదం!

Vikarabad: వికారాబాద్ పట్టణ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.

MOGULAIAH, VIKARABAD
Published on: 8 Oct 2026 11:04 AM IST
Vikarabad
X

Vikarabad: గ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి చెరువులోకి తప్పిన ప్రమాదం!

Vikarabad: వికారాబాద్ పట్టణ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లారీలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రమాద తీవ్రతపై స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఎలాంటి పేలుడు లేదా ఇతర ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD