Balanagar: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం!
Balanagar: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు పట్టివేత ఒడిశాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన డీటీఎఫ్ బృందం రూ.1.45 లక్షల నగదు, మత్తు పదార్థాల స్వాధీనం.
Balanagar: బాలానగర్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం!
బాలానగర్: కుత్బుల్లాపూర్ పరిధిలోని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను డిటిఎఫ్ టీం పట్టుకున్నారు. ఒరిస్సాకు చెందిన నిందితులు హెచ్. కుంతియా, సుఖనాథ్ అనే వ్యక్తుల వద్ద 500 గ్రాముల గంజాయి సిగరెట్లు, 1.052 కేజీల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు.
వీటితోపాటు రూ. 1.45 లక్షల నగదును కూడా సీజ్ చేశారు. నిందితులను నగదును బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు కుత్బుల్లాపూర్ ఈఎస్ ఆర్ ప్రవీణ్ తెలిపారు.




