Maheshwaram: విల్లాల్లోని సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా భారీ మోసం!
Maheshwaram: విల్లాల్లో ఉండే సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తూ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.35 లక్షలు స్వాధీనం.
Maheshwaram: విల్లాల్లోని సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా భారీ మోసం!
Maheshwaram: అధిక రుణాలు ఇప్పిస్తామని, బంగారం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 09.10.2026న Cr.No.395/2026, U/s 316(2), 318(4) r/w 3(5) BNS కింద కేసు నమోదు అయింది.
ఈ కేసులో భాగంగా 18.10.2026 ఉదయం సుమారు 9 గంటల సమయంలో అత్తాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా వారి వివరాలు:
1. షమీన బేగం
2. ఫాతిమా
3. మొహమ్మూద్
వారి వద్ద నుంచి రూ.35 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు విల్లాల ప్రాంతాల్లో నివసించే సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని, అధిక మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. రుణాలు ఇప్పించినందుకు కోటి రూపాయలకు రూ.5 లక్షల కమిషన్ తీసుకుంటామని చెప్పి ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది.
అదేవిధంగా తక్కువ ధరకు బంగారం, పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
తప్పుడు హామీలతో బాధితులను నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.35,00,000 నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ముగ్గురు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ప్రజలకు మహేశ్వరం పోలీసుల సూచన అధిక వడ్డీ, భారీ లాభాలు, తక్కువ ధరకు బంగారం లేదా రుణాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు కోరితే వెంటనే నమ్మకుండా, వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలని పోలీసులు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహేశ్వరం sho రాఘవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
— ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
మహేశ్వరం పోలీస్ స్టేషన్, FCC




