Talakondapally: లింగరావుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించి, సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.
Talakondapally: లింగరావుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ బూత్కూరి వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు శివలింగం, భాగ్య, రమ్య, ప్రమోద్, శ్రీజ, రాజేష్, సీసీ దీప, ఎఫ్‌ఏ రాములు, ఆశా వర్కర్ పద్మ, వీఓఏ సాత్విక, మమత, రబ్బానీ, పార్వతమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను స్మరించుకుని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించాలని ఆకాంక్షించారు.




