Medipally: మేడిపల్లి ఉప్పల్ కోర్టులో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు!
Medipally: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి ఉప్పల్ కోర్టులో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు.
Medipally: మేడిపల్లి ఉప్పల్ కోర్టులో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు!
Medipally: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు నరేష్‌కుమార్ నర్సింగోజు అన్నారు. గాంధీ, శాస్త్రి జయంతిని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం న్యాయవాదులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నరేష్‌కుమార్ నర్సింగోజు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ అహింసా మార్గంలో సాగించిన పోరాటం యావత్ ప్రపంచానికే ఆదర్శమన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలతో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. లాల్‌బహదూర్ శాస్త్రి ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో దేశ రక్షణలో సైనికులు, దేశాభివృద్ధిలో రైతుల పాత్రను చాటిచెప్పారని పేర్కొన్నారు.
నిరాడంబరత, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన శాస్త్రి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. గాంధీ, శాస్త్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు సత్యనారాయణ, రంగు శ్రీకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, పవన్‌గౌడ్, వెంకటసుబ్బయ్య, పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




