Vikarabad: వికలాంగుల హామీలు నెరవేర్చాలి: వికారాబాద్‌లో వినూత్న దీక్ష
Vikarabad: ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్‌లో వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అరగడ్డం, అరమీసంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది.
Vikarabad: వికలాంగుల హామీలు నెరవేర్చాలి: వికారాబాద్‌లో వినూత్న దీక్ష
వికారాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (BVHPS) నాయకులు గాంధీ జయంతి రోజున వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గడ్డంపై అరగడ్డం, అరమీసం కొట్టించుకుని తమ నిరసనను వ్యక్తం చేసి, అనంతరం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వారు ప్రధానంగా వికలాంగుల పింఛన్‌ను రూ.6,000కు పెంచాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, అట్రాసిటీ చట్టం-2016ను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, పారాలింపిక్స్-2024లో ప్రతిభ కనబరిచిన దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
వికలాంగులైన అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆసరా పింఛన్ పొందుతున్న ప్రతి వికలాంగుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.




