Cherlapally: చర్లపల్లిలో ఉచిత యోగా శిక్షణ శిబిరం.. సద్వినియోగం చేసుకోండి!
Cherlapally: చర్లపల్లి ప్రొఫెసర్ జయశంకర్ పార్కులో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1 వరకు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.
Cherlapally: చర్లపల్లిలో ఉచిత యోగా శిక్షణ శిబిరం.. సద్వినియోగం చేసుకోండి!
Cherlapally: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతోపాటు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే లక్ష్యంతో పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. స్వామి రాందేవ్ జీ మహారాజ్ ఇచ్చిన 'ఆరోగ్యం నా జన్మసిద్ధ అధికారం' అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా లోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ ఆవరణలో ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి డిసెంబర్ 1వ తేదీ మంగళవారం వరకు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు యోగా శిక్షణ కొనసాగనుంది. ఈ శిబిరంలో ఆసనాలు, ప్రాణాయామంపై ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్వాహకులు కోరారు.
ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు ఆలూరి హరినాథ్ రావు (యోగా గురువు) 9177278698 నం: సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పతంజలి యోగా శిక్షకుల బృందం యోగ గురువు టి రామ్ శెట్టి(+919246543813), యువ ప్రబారి యోగ గురువు బలరాం రెడ్డి, సహ ప్రబారి యోగ గురువు వీరేశం సహకారం అందించనున్నారు.




